మినార్లు గోపురాలంత ఉన్నతంగా ఉండవు మా ఆలోచనలు.
మహల్లు ఆలయాలంత విశాలంగా ఉండవు మా హృదయాలు.
పువ్వులంత స్వఛ్ఛమైనవి కావు మా నవ్వులు.
బండరాళ్ళలోని అందాలని వెలికి తీస్తాంగానీ,
ప్రక్కవాడి కన్నీరు తుడవలేం.
దేశాలమధ్య దూరాలను చెరిపేస్తాం గానీ,
మనసుల మధ్య గోడల్ని కూల్చలేం.
అవును మాది యూగాలునిండిన చరిత్ర,
ధరిత్రి మెచ్చిన సంస్కృతి.
నేను ప్రారంభించాను ప్రపంచజైత్రయాత్ర,
నాకు ఆదర్శంగా నిలిచింది నెపోలియన్ చరిత్ర.
నాకు న్యాయమనిపిస్తే, నన్ను గెలిపిస్తే,
ప్రక్కవాడ్ని భాదించయినా చేసేస్తా.
నేను శిఖరం చేరడానికి తోడ్పడమంటూ శాసిస్తా,
కాదంటే, అడ్డంవుంటే ప్రక్కకు తోసేస్తా.
ఈవిధంగా అందరిని తొక్కుకుంటూ, తోసుకుంటూ
నా లక్ష్యం వైపు పరిగెడుతున్నా.
పీడిత జన అశృప్రవాహం ఉప్పెనల్లే ఎగసినా,
స్వార్ధమనే మరబోటు లో పడుకున్న నాకు,
రంగుల ఊహా ప్రపంచంలో విహరిస్తున్న నాకు,
నేలపై ఇంకుతున్న కంటి చెమ్మ కనబడలేదు.
ఇంత చేసి, ఇన్ని చేసి సాధించా విజయం.
కొంత కొతగా చేధించా నా లక్ష్యం.
విజయగర్వంతో చుట్టూ చూసాను.
నేనెక్కడున్నాను?
జలజల ప్రవహించే రక్తపుటేరు వొడ్డున,
ఎముకల గూడులు నిండిన గుడారాలతో,
శిధిలమైన జగత్తులో పదిలంగా.
ప్రేతాలు విడుస్తున్న తుదిశ్వాసల మలయమారుతంలో,
భూతాలు సంచరిస్తున్న రుధ్రభూమిలో,
ఒంటరి గా నిల్చున్నా.
నేనిప్పుడు విజేతను కాను,
నేనొక అభాగ్యుడ్ని, అనాధను.
ప్రేమించడానికి, పరిపాలించడానికి మనసులు, మనుషులు లేని,
భూతాల రాజ్యానికి ఏకైక చక్రవర్తిని.
పగిలిన గాజు ముక్కల్లో నిన్నటి నిజాన్ని వెతుకుతున్నా,
కానీ పగిలింది అద్దం కాదు నేను నమ్మిన నిజమే.
నేను నిన్నే చూస్తున్నా,
నువ్వప్పుడు వెన్నెలని చూస్తున్నావు.
కలల అలలు నిజమనే తీరాన్ని తాకితే,
మనలో మరో కలాం పుడతాడు.
నీ కనుకొనల మొనలు తాకి
నా మనస్సుకయ్యిందో గాయం.
దాని భాద నాకో జీవిత కాలం.
అనంతమైన చీకటి లో ఓ చిరు దివ్వెను వెలిగించాను.
చూడాలి గెలుపు చీకటిదో? చిరు దివ్వెదో?
నీటి లోని చేప ఎరవైపే వెలుతుంది.
మనిషి చీకటి లోకి వెలుతున్నట్టే.
ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను
ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను
అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.
ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు.
- మధు కాగుల
పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పని
గులాబి ముళ్ళని కౌగిలించుకుని
దొరల గడీల ముంగల హోలీ ఆడుదాం
తెలంగాణ భూముల్ని తెగనమ్మినోనికి
గులాబి జెండానూపి దారిచూపినోని నమ్మకానికి
గొంతులు తెగేదాక  పాటపాడుదాం
వూరి బొడ్రాయి దగ్గర సెజ్ ఖడ్గంతో
రైతుకు భూమికి వున్న పేగుబందాన్ని తెగనరికినోని
త్యాగానికి సన్మానం చేసి సంకనాకుదాం
ఎవడేమైతే మనకేమి?
తెలంగాణ వస్తే చాలు
ఫిర్ .................
పాతిపెట్టుకోటానికి జాగలేక
ఒకని ముడ్లో ఒకన్ని బొందపెట్టుకొందాం
జై తెలంగాణ
"పోలేపల్లి రైతుల ఆక్రోషానికి అక్షర రూపం"
Rejoice the death of Telangana farmers in Polepalli
Let’s hug deep the rose thorns
and play holi in courtyard of dora’s gadi
for the lips that got sealed tight over Pothireddypadu dam
Let’s sing till throats slit in praise of
their courage for waving rose colored flag
in honor of those who sold away Telangana lands
Lets lick armpits and felicitate sacrifices of those
who butchered at the village bodrai
farmer’s umbilical cord with the land
Why think of whatever happens to anybody
isn’t Telangana that is all we need after all?
And……..
bury each other in our asses as there is no land left for a graveyard
Long live Telangana
Expression in words of Polepalli SEZ farmers’ anger
by - Madhu Kagula
Mahbubnagar District Convenor, Telangana Aikya Karyacharana Committee
translated by - M Bharath Bhushan
PS: rose thorns, rose flag, dora gadi and bodrai refer to specific Polepalli SEZ context where TRS MLA is actively supporting the SEZ . otherwise it is like SEZ elsewhere. rose color refers to the flag of TRS party
తరవాత
నీడతోనే మాటలు.
కలలూ కలవరింతలూ జ్నాపకాలూ
పలవరింతలూ
యెప్పుడూ
వొకే వొక్క వైపు పర్చుకునే చూపు
చివరి అంధత్వాన్ని నిలదీసే వెల్తురు తలుపు
యీ నిష్క్రమణకి
అర్థం యేమిటని
యిప్పటికిది ఎన్నోసారి అడగడం?
యిప్పటికిలాగే వెళ్లిపోవడం
అనే యీ చిట్టచివ్వరి క్రియ తరువాత
ప్రతి మాటా
వొక అసంబద్ధ అబద్ధం.
తెల్లవస్త్రాన్ని కప్పుకుని
ఆయనొక నిలువెత్తు వాక్యంలా లోపల -
యెప్పుడో రాయాలనుకుని
మరిచిపోయిన ఆదిమవాక్యం.
నిశ్శబ్దంగా
తనని తానే చదువుకుంటూ
తనలో తనే సంచరిస్తూ
బయట రోదించే లోకాన్ని
నేలకి బాదుకునే గుండెల్ని
అన్నిట్నీ
యీవలి తీరంగా చూస్తూ/వింటూ
యెప్పటి చిర్నవ్వుతోనే సమాధానమిస్తూ -
యింతే, యిక యిక్కడితో అందరినించీ
తెగిపోతున్నానన్న
చివరి జ్నానమేదో వుదయిస్తున్న ముఖమ్మీద.
యీ దూరాలూ
యీ ప్రయాణాలూ
యీ కలల కదలికలూ
నిట్టూర్పుల చప్పుళ్లూ
కలిపే / విడదీసే మాటల మౌనాలూ
కలిసి పంచుకున్న ఆకాశాలూ
యింతా చేస్తే
దేనికైనా అర్థం కన్పిస్తుందా,
యిప్పుడింక ...
మళ్లీ వస్తారా, తాతయ్య?
చిన్నూ, నువ్వడిగిన ప్రశ్నకి
యిక్కడెక్కడా సమాధానాల్లేవు
ఏడాకాశాల ఆవల కూడా.
నీటి కడుపులోకి వెళ్లి
మళ్లీ తీరమ్మీదికి
పసిపిల్లాడిలా పరుగెత్తుకుంటూ వచ్చే అల -
బతుక్కి ఇంకో తలుపు - మరణం.
నిజానికి ఇంకో వైపు - కల.
అబద్ధాలూ
నిజాలూ
అన్నీ అర్థమవుతూనే వుంటాయి
పసికళ్లకి.
(ఇంత అద్భుతమైన సంస్క­ృత పండితులు ఇంకా ఈ కాలంలోనూ వున్నారా అన్న విస్మయంలోంచి తేరుకోకుండానే - కన్నుమూసిన
కంబదూరు రాఘవేంద్రరావు గారికి - 'తాతయ్య మళ్లీ వస్తారా?' అని చిన్నూ అడిగినప్పుడు ...)
Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.
మాట ఎప్పుడూ అంతే
చెప్పిన మాట వినదు
మాట కత్తిరిస్తుంది
బంధాల్ని, బంధనాల్ని
మాట కలుపుతుంది
మనుష్యుల్ని, మనసుల్ని
మరణానికి ముందో, వెనుకో
ఓ మాట మాట్లాడవూ?
ఫ్రేమకు ముందో, మోసం తర్వాతో
ఓ మాట మాట్లాడవూ?
వర్ణక్షరాలతో కాదు
వొంటి మీద గాయాలతో
నెత్తురోడుతున్న మనసుతో
మాట్లాడవా
రక్తస్రావం గురించో
మనస్తాపం గురించొ
మాట్లాడవా?
దాక్కుంటున్నవా? దాచుకుంటున్నవా?
ఏదో ఒకటి చెప్పు
ఎగతాళైన తాళి గురించో
ఓడిపోయిన అమ్మతనం గురించో
మూసిన బాధల గుప్పెట్లొంచి
రంగురంగుల సీతకోకచిలుకల్ని
ఇక ఎగరేయి
స్నానం
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది
నువ్ చేసిన గాయస్రావం రాత్రి
నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో
నా నడుంగీత మీంచి
నువ్వలా నడిచివస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును  కదా
అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు
ప్రాణమా
ఎదురుగ వుంది
దేహమా
ఇక్కడే వుంది
మరి కలయిక....
నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు
1
కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
దాన్ని కప్పేశాం, గుర్తుందా?
మరీ చిన్నప్పటి సరదా కదా,
గుర్తుండి వుండదులే!
రాయడానికేమీ లేని తనం
నీకూ, నాకూ , బహుశా అందరికీ.
కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.
ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.
బాధ లేదని కాదులే!
కాకపోతే, ఎవరి బాధో తప్ప
రాయలేని తనం
అరువు కళ్లతో ఏడుపు,
కొయ్య కాళ్ళతో పరుగు!
ఏదో వొక కొయ్య కాలు చాలదేమో,  లోపలి పద్యానికి!
3
సొంతమూ, పరాయీ అని కాదు కాని
నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి
ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!
చర్మం కూడా  పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.
మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!
4
తవ్వోడ దొరికింది సరే,
అదే పద్యం అనుకుంటున్నాం
నువ్వూ, నేనూ, అందరం!
లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,
లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే - దొరుకుతుందా, పద్యం?
పద్యం పుట్టుక  అసలేమైనా గుర్తుందా?
వుండి వుండదులే,
మరీ చిన్నప్పటి సరదా కదా?!
ఆ వానచుక్కల అడుగుల చప్పుడు
కళ్ళకు వినిపిస్తునే వుంది
ఆ గాలి కిటికీ మూతపడుతున్న శబ్దం
చెవులకు కనిపిస్తునే వుంది
ఆత్మీయ అశాంతి
తడి సంతకం
సముద్రం తలుపు తడుతూనే వుంది
ఇప్పుడక్కడ ఎవరూ ఎవరితోనూ కలవరు
ఏది ఎవరికి మిగలనివ్వని రహస్య జడివాన
యవ్వనాన్ని స్కలిస్తోంది
కాంక్షల్ని ఎగరేస్తోంది
వదిలిపెట్టలేని ఏకాంతాన్ని
దగ్గరవ్వలేని శరీరాన్ని
అగ్గిలా తడిపి ఆరేసే వానని
కొంచెం ఒడిసిపట్టుకుందాం, ఇటు రండి
నిద్ర నాకు గాయాన్ని కానుక చేసింది
గాయం నాకు రాత్రిని కానుక చేసింది
ఈ రాత్రినేం చేసుకొను?
నిద్ర పెట్టె తీసి
చంద్రకాంత శిలానేత్రాలని తెరిచాను
కన్నీటిని దాచుకుంది దుఖ్ఖం
నిద్ర రాదు
కలలూ రావు
నిజాల్ని అబద్దాలుగా చూడటం ఎలా?
నిద్రంటే
నిజాల్ని దాచుకోవటమేగా
కలలంటే
స్ర్ముతుల్ని ఎగరేయటమేగా
ఏ నిజ సూర్య కిరణంలోంచో
నిద్ర వస్తూ వుంటుంది
నా పార్ధివ కాంక్షల్ని
భుజాన మోసుకెళ్ళేందుకు-
వెళుతూ వెళుతూ
ఓ అబద్దాన్ని జారవిడిచింది
అది పగలై నన్ను నిద్రపుచ్చింది
పసిపాపై జోలపాడింది
(ప్రజాతంత్ర సాహిత్య సంచిక, 2001)
కవిత్వం  అబద్దానికి పుట్టిన ఆడపిల్ల -- అజ్ఞాతకవి
పదములతో భావనకు భ్రాంతి కలిగించుటయే కవిత్వం -- గోల్డ్ స్మిత్
నగ్నసత్యం వేదాంతం, అలంకృత సత్యం కవిత్వం -- బోయి భీమన్న
బాధ నుంచి ప్రభవించు కవిత, అందుకే అక్షరమ్ము రాక ఐతి కవిని -- ఆరుద్ర
సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ దొర్లిపడు కొండధార మాడ్కి
సహజకవిత బయలపడి సన్నుతిగను -- ఆదిభట్ల నారాయణదాసు
కవిత్వం ఒక మెరుపు, కాదది పొడి మాటల కూర్పు -- ఖలీల్ జిబ్రాన్
మనసు మల్లెపొదల్లోంచి పసందైన వాసనలు వీచి,
అవి పద్యాల సీసాల్లో అనంతకాలం నిలిస్తే కవిత్వం -- దాశరధి
అగ్ని జల్లినా అమృతం కురిసినా , అందం ఆనందం దాని పరమావధి -- తిలక్
కల నిజపరచటం కాదు కవిత్వం
నిజాన్ని కలగనడమే దాని తత్వం -- ఆరుద్ర
ఆవేశమప్రయత్నముగా మూర్తీభవించియుండు పదములును, భావములునూ గాక కవిత్వమనగా ఇంకేమి? -- జాన్ స్టువర్ట్ మిల్
కప్పిచెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శనం -- సినారె
గొప్ప కవిత్వం ప్రధాన లక్షణమేమంటే, ఎవరి తాహతును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగటం -- చలం
అన్య భాషల్లోకి అనువదించటం సాధ్యం కానపుడే అది గొప్ప కవిత -- బేకన్
నాగరికత అభివృద్ధి చెందినకొద్దీ కవిత్వం దాదాపు తప్పని సరిగా క్షీణిస్తుంది -- మెకాలే
అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రోజైక్ భావం పోయట్రీ అవదు. కవిత్వం ఒక అల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు -- తిలక్
12, 13 నిర్వచనాలు నాకు బాగా నచ్చాయి, కానీ 14 లో మొదట నాగరికతకీ, కవిత్వానికి లంకె నేరుగా ఎందుకు పెట్టాడో అనిపించింది. బహుశా, ప్రకృతితో నాగరికతని ముడిపెట్టి, తరిగిపోయే ప్రకృతి సంపదతో పాటే కవిత్వం కూడా నశిస్తుందన్నాడేమో.  ప్రకృతి లేని కవిత్వమేమిటి, అవును నిజమే,  కానీ అది పాశ్చాత్యులకు నప్పుతుందేమోగానీ, నూటొక్క రకాల కవిత్వాలని కనుక్కొన్న మన వాళ్ళు దీనిని ఒప్పుకుంటారా?
**  మన్నవ గిరిధరరావుగారి "మణిదీపాలు"  నుంచి
గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!!
వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో
ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో
ఒక్క సాక్ష్యమూ దొరకదు
ఒక్క మాటా వినిపించదు
అంతటా మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్ద చారికలు
వాళ్ల పుస్తకాల్లోకి తొంగి చూద్దామనుకుంటాను
ఒక్క పుటనయినా చింపి మీకు చదివి వినిపిద్దామనుకుంటాను
కన్నీళ్లతో అలుక్కుపోయిన అక్షరాల్ని
మీకు కన్పించేలా తిరగరాద్దామనుకుంటాను
మనశ్శరీరాల్ని మండించే కార్చిచ్చుని
స్మృతుల్లో నిలపాలనుకుంటాను
అయినా
అంతటా ఓ మౌనం
ఎక్కడో ఓ చోట
ఏదో ఒక కొండ
చివర్న భూమ్యాకాశాల్ని నిలదీస్తూ కొన్ని ప్రశ్నలు
కొండల్ని తవ్వి
అడవుల్ని చీల్చిన
కాలిబాటల్ని ఛిద్రం చేసిన తెల్లమృగాలు
అందమయిన వారి ముఖబింబాల మీద
చెక్కిన గాయాలు
ఇప్పుడు… అడవులన్నీ శిథిలస్మృతులు
అవును కానీ…
ఎక్కడైనా రక్తపుటేరులు మాట్లాడతాయా?
ఎక్కడైనా జ్ఞాపకాలు గొంతెత్తి నిలదీస్తాయా?
ఎక్కడైనా విరిగిపడ్డ చెట్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!
ఓ అర్థరాత్రి గీసిన లక్ష్మణ రేఖ
వాళ్ల స్థలకాలాల్ని విభజించింది
విషాదరేఖకి అటూ ఇటూ కూడా
మతాల ముసుగు వేసుకున్న మానవమృగాలే!
నిప్పులగుండాల్లోంచి పైకి రాలేని సీతలే!!
చారెడు మట్టిని
గుప్పెడు వేర్లని
వాళ్ల శవాలపై చల్లి
చేతులు దులిపేసుకున్నాం కదా!
అంతా మన పిచ్చి గానీ
ప్రవహించే నదులు సాక్ష్యాలు చెపుతాయా?
శవాల్ని మోసిన బావులు మాట్లాడతాయా?
మట్టివాసనలు మనుష్యుల మూలాల్ని పట్టిస్తాయా?
అంతటా ఓ మౌనం
ఏదో ఒక చివర నాలుగు గుసగుసలు
ఎక్కడో ఓ చోట మృత్యువు చిరునామా
ఆద్యంతాల నడుమ నలిగే నిశ్శబ్దచారికలు
కొండల్ని దాటి కోనల్ని దాటి
మైదానాల మీదకు పరుగులు తీశామా
మాయాబజార్ల వాకిళ్లు తెరిచి
కొత్తయుగాల్ని స్వాగతించామా?
వెయ్యికాళ్ల పురుగులతో
సాలెపురుగుల వెబ్‌లతో చెలిమి చేశామా?
ఉన్మాద ప్రేమ ముసుగేసుకున్న
మాయదారి మృగమొకటి
ఇప్పుడిక్కడ మంత్రనగరుల్లో సంచరిస్తోంది
అమ్మాయిలూ! పారాహుషార్!
అంతా మన భ్రమ కానీ
ఎక్కడైనా గొడ్డళ్లు, యాసిడ్లు సాక్ష్యాలు చెపుతాయా?
ఎక్కడైనా కాల్‌సెంటర్ల టాక్సీలు మాట్లాడతాయా?
మాట్లాడేందుకు గొంతుల్లేక
రాసేందుకు చేతుల్లేక
చూపించేందుకు మొహాల్లేక
నిశ్శబ్దంగా, నిర్వేదంగా
అక్కడొక చెక్కేసిన బోధివృక్షం నిల్చొని వుంది
ఎన్నాళ్లీ జ్ఞాపకాల కుండల్ని మోసుకుతిరగను?
ఎన్నాళ్లీ కన్నీళ్ల తర్పణాల్ని వదలను?
కాలుతున్న శవాలతో ఎన్నాళ్లు సహజీవనం చేయను?
ఈ హింసకు వాక్యాల్లేవు
ఈ హింసకు సాక్ష్యాల్లేవు
ఎప్పుడు చెప్పినా ఒక్కటే కథ
ఒక్కటే కథనం
ఈ హింసాచరిత్రకు దేహమే మొదలూ, దేహమే చివరా!!
(praanahita Jan 08)
This poem can also be found at http://chakradhar.net/poems/amrutamkurstondi.jpg
chakradhar
www.chakradhar.net
This poem can also befound at
http://chakradhar.net/poems/malliirandi1.jpg
http://chakradhar.net/poems/malliirandi2.jpg
Chakradhar
www.chakradhar.net
1
యెవ్వరికీ చెప్పలేదు కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని
2
పొద్దున్న నిద్రమొఖంతో మబ్బు కళ్ళతో
దాని ఆకుల్లోకి తీక్షణంగా చూసి దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
పొద్దుటా, మధ్యాన్నం, రాత్రి పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు
దాని నీడ నేనయ్యానో  అది నా నీడ అయ్యిందో?!
3
దాని లేలేత వగరు ఆకుల్ని అప్పుడప్పుడూ నవుల్తూ
దాంతో మాట్లాడ్తున్నట్టొ, పోట్లాడ్తున్నట్టో
అన్ని వయసుల యేడేసి రంగుల్లో   దాంతో ఆడ్తూనో,
రాయని ప్రేమ లేఖల్ని దాని జడ పాయల్లో దాస్తూనో
దాపరికాలు లేవు యిక్కడికొచ్చాక.
పరాయి క్షణాల్లేవు యీ గడియారంలో.
4
యెవ్వరికీ చెప్పనయితే లేదు కాని యిక్కడ నేను కూర్చున్న చోటే
యీ అరుగు మీదే
జీవితాన్ని గురించి బేఫికర్ గా బేఖాతర్ చేస్తూ
రాత్రిని పగల్లాగా, పగటిని రాత్రిలాగా మార్చి మార్చి చూసుకొని
లేనిపోని తకరార్లు పడి, ఆరునూర్లయ్యి ఆరు కాలాల వర్ణ వివర్ణ దృశ్యాలన్నీ మారి
చివరికి యెవరికెవరు మారామో తెలీదు కానీ  యిప్పుడీ క్షణం ఆ చెట్టు వొక అజ్నబీ!
5
యింతే!
ఆ క్షణానికి గెల్చిన అప్పటి ఆటలు  ఇప్పుడు వోడిపోతాం.
6
బయటి కన్ను మూసుకున్నప్పుడు లోపలి కన్ను వెలిగించుకొని
లోపలి కన్ను మసకేసినప్పుడు  బయటి కన్ను దీపం పెట్టుకొని
వొళ్ళంతా తడుముకొని వెతుక్కున్నట్టు
జాంచెట్టు నన్ను నిలువెల్లా జల్లెడ పడ్తుంది,
నన్ను యెట్లయినా నన్నుగా రాల్చాలని!
7
అననైతే అన్లేదు గాని యిన్నాళ్ళ
యిన్నేళ్ళ నిశ్శబ్దం తరవాత వొక చెట్టూ
వొక నిలువెత్తు మనిషీ  కుప్ప కూలిపోతున్నట్టే వుంది కళ్ళ ముందర!
8
వెతుక్కుంటూ వెళ్తే యిప్పుడిక్కడ ఏమీ లేదు కాని
వొక మిగుల పండిన జాంపండు వాసన
వొంటికంతా అంటుకున్న నిప్పు.
9
మాగన్నుగా నిద్దరోతున్న లోపటి వొళ్ళు
దాని గడ్డ కట్టిన నిద్రా హిమవత్పర్వత  లోఅరణ్యం
నిప్పు గుండం.
10
నిద్ర మీంచి నిప్పుల నడక
వొకే వొక్క మెలకువ
యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం!
వొక జ్ఞాపిక : “ ఈ జాంచెట్టుని పెళ్ళగించి, ఇంకో చోట నాటగలవా?” - అని అడుగుతుంది సయీద్ అఖ్తర్ మీర్జా సినిమా ‘నసీమ్ ‘ 1995 లో వొక ప్రధాన పాత్ర. ఆ జామ చెట్టు భారతీయ ముస్లిం అస్తిత్వానికి వొక ప్రతీక.
ఏమైందో ఆ మాసిన టోపీ.
ప్యాంటుజేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి
తలకు చుట్టాను
జుట్టు జూలు విదిలించకూడదు
సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు
ఎదురుచూపులు
అసర్‌కోసంఅజా పిలుపుతో
పావురాలు ఆకాశం గూటిలోకి రెక్కలెగరేశాయి
పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికిచానాళ్ళకు
అసర్‌ సమాజ్‌ అయ్యింది.
వందేళ్ళ క్రితం కన్ను మూసి
ఆ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న
ఆ సూఫీ మునిని కప్పుకున్న దాదర్‌లోంచి
ఆయన దేహంలోకి చూశాను
నా దేహాన్నంతా వొంపి
ఆయనని కళ్ళకి అద్దుకున్నాను
దువా చదువుతూ
మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటి చుక్కలై
ఆయన దాదర్‌పైన వాలాయి
అవి రెండు పక్షులై
ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి
బయటికి రాలేకపోయాను
ఆయనలోంచి.
ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం
ఏ కాస్త మోటుగా తాకినా
చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరిచినట్టు
ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను
ఈ యాత్రకి అర్థం ఏమిటి?
బయటికి అడుగుపెట్టానో లేదో!
ఒక పక్షుల సమూహంలో
ఏదో పేలిన శబ్దం.
అందరూ పారిపోతున్నారు
ఎవరూ కనిపించడం లేదు
కత్తులు తప్ప.
ఏమీ వినిపించడం లేదు
కొసప్రాణం అరుపులు తప్ప.
మళ్ళీ లోపలికి పరిగెత్తాను
అక్కడా నిశ్శబ్దం
ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో
దర్గా రాయి మీద ఏదో రాస్తోంది
దాదర్‌లోకి ముక్కు దూర్చి
వెక్కివెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది
ఎక్కడికి వెళ్ళాలిక?
నాలోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను
﻿సెప్టెంబర్ 2002
﻿ వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.
కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
రైలు .. రైలు .. హమారీ ఘర్‌కీ రైల్‌ .
ప్లాట్‌ఫారమ్మీద పిల్లల ఏడుపులూ
ఎదురుచూపు కొసన పెనవేసుకునే ఒత్తిళ్ళూ.
విడిపోయేటప్పటి మౌనానికి
ఏదో వొక భాషనివ్వు .. ఏదో వొక సంకేతాన్నివ్వు
కన్నీళ్ళు తప్ప.
మరణం కూడా అంతేనా?
దేహం వొక భాష. వొక గుర్తు.
దూరంగా మబ్బుపొరమీద పగిలిపోతుంది పాట
చూపుపొలిమేర దాటి మలుపు తిరిగే రైలుబండిలానే.
చివరాఖరి రైలుకూత గుండెలోకి దూసుకుపోతుంది.
రాత్రీపగళ్ళూ దగ్గరికొస్తూ దూరమవుతూ
అదే కూత … లోపల.
దీనికి మందు లేదు, సురయా!
నువ్వేదో పాడుకుని వెళ్ళిపోయావు కానీ
దీనికి భాష లేదు.
యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.
బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం.
పోనీలే, సురయా!
కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ … నీకోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
అక్కడైనా వుంటాయంటావా?
వుంటే, సరే!
﻿మార్చి 2004
లోపలి ధ్యానంలో
మెట్లు కనిపించవు
మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని
శిఖరం కొసకి చేరుకుంటాం
అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి
ఈదురుగాలుల హోరులోనో
అందీ అందని మబ్బుల్లోనో
వొంటరిగా నిలబడి
లోపలికి ప్రవహిస్తాం
యెక్కడెక్కడోఅ చెవులు మొలుచుకొచ్చి
దేహమంతా వొక పక్షి ఈక.
అప్పుడింక చూడాలీ వినాలీ
గాలి అలలు
విరుగుతున్న చప్పుళ్ళని.2
బయటి రోడ్డు మీద
ఉక్కుపాదం
గాలిదేహాన్ని తొక్కేస్తుంది.
రెండు పెదాల్నీ కలిపికుట్టేస్తుంది
తుపాకి భాష ఎక్కడైనా ఎప్పుడైనా
అదే…
ఊపిరిపీల్చడం నేరం
తన చప్పుళ్ళే మార్మోగాలి
చెట్లకి చిగుర్లు పుడితే నేరం
ఆకుపచ్చగా విచ్చుకుంటే శిక్ష.
చివరికన్నీ ఇనపగజ్జెలే కావాలి
ఇనపమాటలే వినిపించాలి.
అప్పుడింక
వయొలిన్‌ లోపలి ధ్యానానికి
తుపాను భాషనేర్పుతుంది
దాచేసిన నిప్పంతా
సుతిమెత్తని కమానులోంచి
కార్చిచ్చు.
ఎంత చిత్రం!
వయొలిన్‌ నినాదమవుతుంది
వసంతం గర్జిస్తుంది!
(రెండు సింఫనీల అనుభవం తర్వాత వొకటి మామూలుగానే బీతోవెన్‌ది. రెండోది స్టాలిన్‌ కాలంలో వసంతమేఘాల మీదుగా తిరుగుబాటుని ఆలాపించిన వయొలిన్‌.)
జూలై 2004
ఏ అన్నాల వేళో
మిమ్మల్నందర్నీ విడిచేసి వచ్చాను
అది మధ్యాన్నమో, రాత్రో గుర్తులేదిప్పుడు. నేను సగంలోనే వచ్చాక -
మిగిలిన అన్నం మీరు తిన్నారా?
ఆ తరువాత మూతిమీద ఎక్కడైనా
మెతుకులు మెరుస్తున్నాయేమో చూసుకున్నారా?
నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు -
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.ఏ అన్నాల వేళో మరి
పొలిమేర దాటి,
దేశం దాటి,
సముద్రాలు దాటి వచ్చేశాను.
గుర్తున్నానా?
అని ఆ తరువాత నేనే మీకు గుర్తుచేసుకున్నాను
కాలాన్ని దాటకుండానే గతంలోకి జారుకుంటూ.
నిన్న రాత్రే
మీతో కూర్చున్నట్టుగా,
మాట్లాడినట్టుగా,
మీతో కలిసి అన్నం తింటున్నట్టుగా,
మీతో మేడమీద బిచానా వేసినట్టుగా -
ఏది అవునో ఏది కాదో?
ఏ దీపం వేళో నేను దిక్కుల్ని ముట్టి వచ్చేశాను
ఇప్పుడు కాయితమ్మీద రాస్తున్నప్పుడు
ఇది ఇప్పుడా కాదా అని సందేహం
టవర్‌క్లాక్‌లోంచి గంట మోగినప్పుడు
ఇప్పుడు నడుస్తున్న దారి వున్నట్టుండి నిన్నట్లోకి.
కాలాన్ని ఎక్కడో శుభ్రంగా జారవిడిచేశాను.
ఏ అన్నం వేళ
ఏ సగం కడుపుతో బయలుదేరానో
ఇప్పుడింకా ఆకలి
కడుపు నిండా
కళ్ళ నిండా!
జనవరి 2006
ఎత్తయిన గోడల రాజప్రాసాదాల సుందరనందనవనాల సెలయేటి పరుగుల విశాల రహదారుల నగరాన్ని దాటి వొక్కసారి నా పల్లెలోకి నడిచివెళ్లు. కూలిన పూరి గుడిసెల ఇరుకురాదారుల కుప్పకూలిన రైతుదేహాల్ని ఇంకించుకుంటున్న శిధిలమైన పొలాల బండరాళ్ల ఎముకలు ముందుకు పొడుచుకొచ్చిన ఏర్లూ చెర్వుల నడుస్తున్న అస్తిపంజరాల నను కన్న నా పల్లెలోకి ఆగి ఆగివెళ్లు. గతం నీ అందమైన కల కదా, దొర గడీల ముందు చెప్పుల్విప్పి, గొడుగుల్మూసి దండం పెట్టడానికే వున్న దేహాన్ని, దాని వెన్నెముకనీ విల్లులా వంచి, వంగి వంగి నడవడం, నడవలేక నడవడం ఓహో... ఎంత అందంగా వుందో కదా.
నిజమే, కాసేపు ఈ విస్మ­ృతి అందంగానే వుంది. కానీ.. బానిస అమ్మనాన్నల బిడ్డలం కదా మేం. ఆకలితోనో ఆకలి మీద కోపంతోనో వెర్రి కేక వేసి, గోళ్లల్లో మేకులు దిగ్గొట్టించుకున్న బానిస అమ్మానాన్నల బిడ్డలం కదా మేం. కడుపునిండా ఆకలితో అర్థరాత్రి ఇంటికొచ్చిన అన్నకి కాస్త అంబలి పోసి నందుకు తెల్లారేటప్పటికి ఇల్లు ఇల్లంతా వల్లకాడయి తల నీడ పోగొట్టుకున్న తల్లి బిడ్డలం కదా మేం. తలుచుకున్న కొద్దీ తలపోతల జలపాతంలో తడిసిపోతున్నాంలే, ఇప్పుడు. కానీ.. నాదంతా నెత్తుటి తలపోత.. అప్పుడప్పుడూ కాసేపు ఆ నెమలీకల్ని మరిచిపోతేనే బావుణ్ను. కానీ...
ఈ శరీరానికి అది సయించడం లేదు. సరిహద్దుల లోపలా బయటా నేను శత్రువునే. ఎవరో ఇచ్చిన షేర్వానీ కప్పుకుని లోపలి గాయలన్నీ దాచుకోలేను. నా లోపల నెత్తురింకనంతకాలం ఏ రాజ్యానికీ నేను ముద్దుబిడ్డని కాలేను. 1948 రాత్రికి రాత్రి ఎల్లలు దాటేసి నా నేలని గిరవాటెయ్య లేదు. ఎక్కడైనా నాకేం మిగిలిందని? నేనె ప్పుడూ వెంటాడబడేదేహాన్ని సరిహద్దుకంచెలకి చిక్కుకుని తల వేలాడేసే అనాథని.
రాజ్యానికి ఆవల వొక ధిక్కార సూఫీ స్వర్గాన్ని నిర్మించుకున్నవాణ్ని. ధిక్కారం నా మతం నిరసన నా కులం గోళ్లల్లో మేకులు దిగ్గొట్టే రాజ్యాన్ని తూరుపు ఉరికంబం ఎక్కించడం ఒక్కటే నా రాజకీయం. నీ గతం కాల్మొక్కలేను ఆస్తిత్వ ఉన్మత్త ప్రేలాపనలో చరిత్రని నిలువునా వంచించలేను. ఎప్పటికీ బాంచన్ కాలేను వొక్క క్షణాన్నయినా విస్మ­ృతిలోకి జారిపోలేని వాణ్ని. కాలం నా వేళ్ల సందుల్లో గడ్డ కట్టిన నెత్తురు. దాన్ని తుడిచే సే పర్షియన్ ద్రావకం ఇంకా పుట్టలేదు.
- అఫ్సర్
మెలకువలో జననం
స్వప్నంలో మరణం
ఆ గోడలు ఆమె బాధల్ని పలవరించాయి
ఆమె కన్నీటిని తుడిచాయి
ఆమె కుంచెల్ని హత్తుకున్నాయి
ఆమె దుఃఖానికి రంగులద్దాయి
సరిహద్దుల్లేని ఆ నీలపు గోడలు
ఇప్పుడామె కలవరింతల కథల్ని
మనకి చెబుతాయి
ఆ గోడలు ఆమె వేదనకు
ఎర్రరంగునద్ది విసిరేశాయి
ఆమె దుఃఖాన్ని కలబోసుకున్న కుంచెలన్నీ
తన బొమ్మలై రంగులరాట్నమాడాయి
ఆమె గాయాల ముందు మోనాలీసా
నవ్వు చిన్నబోయింది
మూడు ముక్కలైన వెన్నుపూస
నడిరోడ్డుపై పోగొట్టుకున్న వెజీనా
32 శస్త్రచికిత్సలు
రెండు గర్భ విచ్ఛిత్తులు
రెండొందల చిత్రాలు
ఇదీ నాలుగుమాటల్లో ఆమె జీవితం
తనువు నిండా కత్తిగాట్లు
తలవెనుక మృత్యనీడల సహజీవనం
అరణ్యంలోకి పరుగెత్తిన
గాయపడ్డ లేడి
సింహాన్ని చంపి ఇప్పుడు అడవికి రాణి
ఆమె మరణం కొత్తచూపు
ఆమె గాయం కొత్తపాఠం
కొందరంతే ఏటికి ఎదురీది మరణిస్తారు
మరణంతో గెలిచి బతుకు అర్థం చెపుతారు
: and her story ends at the same place : Blue House, Mexico
Viva la Frida ( Long live Frida)
(వేదనకు కొత్తచూపునిచ్చిన మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిదా కహ్లో కోసం ...)
కల్పనా రెంటాల
అంధ్రజ్యోతి ఆదివారం (డిసెంబర్ 23,07)అనుబంధం
ఈమాట,సెప్టెంబర్ 2002 » కవితలు
రచన : కల్పన రెంటాల
దార దారాల దేహం
వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు
రామచిలకలు వాలినట్టు
కోకిలమ్మ పాడినట్టు
పచ్చటి ఆకుల మృత్యువు తెలీదు
పట్టుపరికిణీ యౌవనానికి మరో కన్నెరికం
ఎంత ప్రేమ పెంచుకున్నా
అన్నింటికి ఆ నేలే సమాధి
ఆ మనోసౌందర్యం
ఉడుకుతున్న నీళ్ళకేం తెలుసు?
హింసించే నోటికేం తెలుసు?
వాతలు పెట్టే చేతికేం తెలుసు?
తెగిపడుతున్న దారాలు
కోల్పోతున్న అనుభూతుల్లాగా
ఇప్పుడంతా చిక్కుపడిపోయింది మనసులాగే
మోసపోయిన ప్రేమలాగే
ఆరున్నర గజాలే!
ఆరడుగుల నేలే!
ఆ చల్లటి మృత్యునీడే చివరికి మిగిలేది?
ఒక్క పట్టుచీరకు ఎన్ని మృత్యువులో!
ఒక్క స్త్రీకి ఎన్ని మరణాలో!
ఈమాట,జనవరి 2008 » కవితలు
రచన : కల్పన రెంటాల
మంచుప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్‌చివరిచూపు, చివరిమాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్ళీ తొలిప్రేమంతా తాజాగా
పక్షుల ఈలపాట మెహఫిల్‌ మీద
పిల్లల నవ్వుల పువ్వుల కేరింతలు
మళ్ళీ కొత్తజీవితపు కోటి ఆశలు
ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?ఆస్టిన్‌ నీరెండల మధ్య మాడిసన్‌ స్మృతులు
తొలిముద్దు ముద్దమందారాలే!
(మంచునగరం మా మాడిసన్‌ కోసం)
(ఒక అభిప్రాయం) మీ అభిప్రాయం తెలియచేయండి »
teresa అభిప్రాయం:
January 1, 2008 7:03 pm
Beautiful!
భూమిక జనవరి 2008
పంజరం నీడ కూడా ఖైదులో వుంది
నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను
నా చేతులు ఇతరుల చేతుల్లో ఒదిగి వుంటాయి
ఒంటరి నది సముద్రంలోకి ఎందుకెళ్ళిపోయిందో?
నిర్ణయం ఎంత ఒంటరిదయింది?
మృతుల కోసం పొంగిపొరలుతున్న దుఃఖం
నేను నిప్పుల్లో మేలుకున్నాను.
రాళ్ల లోపల ప్రతిధ్వనిస్తున్నాను
వాటిలోపల మునిగిపోతున్నాను.
ఈ మట్టి నుంచి ఏ మొక్క పెరుగుతుందో?
నా విషాదాలన్నీ ఓ పసిపాప
నా చేతుల్లో విరిగిపోయిన ఆటబొమ్మలు
నా కళ్ళముందు ఓ మనిషి
అంతులేని మృతదేహాలు
కళ్లకోసం నన్ను ప్రార్ధిస్తున్నాయి
నన్ను నేను ఎక్కణ్ణుంచి ఆరంభించను?
ఆకాశాలన్నీ నా కన్నా చిన్నవి
ఎగిరేపక్షులకు నేలెక్కడ?
ఈ స్వరాల చేతులేవి?
నా అబద్ధాలన్నీ సహించు
అడవి నుండి పక్షులు విడుదలైనప్పుడు
నిప్పుకాగడా రుచిచూస్తుంది
నా అస్తిత్వం కప్పు మీద
నా ఆచ్ఛాదనల్ని ఆరబెడుతున్నాను.
దూరాన్నెక్కడో నా కళ్ళు
నా బట్టలే నా దుఃఖాలు
నేను నిప్పుల బట్టలు ధరించినదాన్ని
నా నీడ పేరు చెప్పనా?
అన్ని రాత్రుళ్ల చంద్రుళ్లని నీకిచ్చేస్తాను?
మూలం - సరాషా గుఫ్తాఅనువాదం - కల్పనా రెంటాల